అబిడ్స్, వెలుగు : మీటర్ చార్జీలు పెంచడంతో పాటు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని లేకపోతే, నవంబర్ 30న నగరవ్యాప్తంగా ఒక్కరోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు మహాత్మాగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ అమనుల్లా ఖాన్ హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతమున్న కనీస ఆటో చార్జీ రూ.30 నుంచి రూ.40కు, కిలోమీటర్ చార్జీని రూ.14 నుంచి రూ.20కి పెంచాలన్నారు. సిటీలో గ్రీన్ క్యాబ్స్‌కు రవాణా శాఖ అనుమతులు ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని, వెంటనే నిషేధించాలన్నారు. చిల్లర విషయంలో జరిగిన వివాదంలో అల్లరిమూకల చేతిలో హత్యకు గురైన ఆటో డ్రైవర్ మహమ్మద్ ముకర్రం కుటుంబానికి పరిహారం ఇవ్వాలన్నారు.
