భారత్ సమిట్ నిధులు, విదేశీ జోక్యంపై విచారణ జరపాలి  : బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి 

భారత్ సమిట్ నిధులు, విదేశీ జోక్యంపై విచారణ జరపాలి  : బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన భారత్ సమిట్ నిధులు, ప్రజాధనం వినియోగం, విదేశీ ప్రతినిధుల భాగస్వామ్యంపై పారదర్శక విచారణ జరపాలని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సదస్సులో విదేశీయుల చట్టవిరుద్ధ జోక్యం, దేశ భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలపై ఆధారాలు ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించాలని ఒక ప్రకటనలో కోరారు.

ఎన్ఐఏ పరిధిలోకి వచ్చే నేరాలు లేదా జాతీయ భద్రతా చట్టాల కింద చర్యలకు ఆధారాలు లభిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇటలీ ప్రతినిధితో పాటు విదేశీ నేతలు భారత ప్రజాస్వామ్య నాయకత్వంపై పక్షపాత ఆరోపణలు చేయడం సదస్సు ఉద్దేశంపై సందేహాలు కలిగిస్తోందని పేర్కొన్నారు. భారత్ పేరుతో నిర్వహించే సదస్సు దేశ వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు సమాచారానికి వేదిక కాకూడదన్నారు.