- పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడి
- రూ.5 కోట్లు తీసుకుని ఎగవేత
- మోసపోయిన ముంబయి బిజినెస్ ఉమెన్ ..కేసు నమోదు
పంజాగుట్ట, వెలుగు : వ్యాపార లావాదేవీల పేరుతో 42 ఏండ్ల మహిళను నమ్మించి రూ.5 కోట్ల మేర ముంచడంతో పాటు, పెండ్లి పేరుతో లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ముంబయికి చెందిన బాధితురాలు ది రాయల్ సింధ్ పేరుతో డ్రైఫ్రూట్స్ ట్రేడింగ్, బ్రోకరేజ్ వ్యాపారం నిర్వహిస్తోంది. 2024 జూలైలో హైదరాబాద్‌కు చెందిన మనీష్ భాటియా ఆమెకు పరిచయమయ్యాడు.
మొదట వ్యాపార ఆర్డర్లు ఇచ్చి నమ్మకం పొందిన తర్వాత అతడి సోదరుడు పవన్ భాటియా, ఫ్రెండ్మహమ్మద్ రషీద్‌తో పాటు నదీమ్ జుమాని, జీషాన్ అహ్మద్, ఇర్ఫాన్ భాడాలను పరిచయం చేశాడు. వీరికి సరుకులు అప్పుగా సరఫరా చేయగా అది రూ.5 కోట్లకు చేరింది. ఆ డబ్బులు అడిగితే తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు మనీష్ భాటియా పెండ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హైదరాబాద్‌కు పిలిపించి లైంగికంగా వేధించాడు.
అతడు తీసుకున్ని, ఇతరుకు ఇప్పించిన సరుకు బకాయిల గురించి అడిగితే..వీడియో కాల్స్ టైంలో తీసిన అర్ధనగ్న ఫొటోలను వ్యాపారులకు పంపిస్తానని బెదిరించేవాడు. దీంతో నవంబర్ 13న ముంబయిలోని మహిమ్ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ చేయగా, దాని ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
