సీఎం సిద్దిపేట పర్యటనతో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుండెల్లో రైళ్లు : ఆది శ్రీనివాస్

సీఎం సిద్దిపేట పర్యటనతో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుండెల్లో రైళ్లు : ఆది శ్రీనివాస్
  • 19న జరిగే సభతో హరీశ్ పతనానికి కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్: ఆది శ్రీనివాస్
  • హరీశ్, సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అవినీతిని కవిత బయటపెడుతున్నరని కామెంట్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న సిద్దిపేటకు రానున్నారని, అదే వేదిక నుంచి రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం సిద్దిపేటకు వస్తున్నారనగానే హరీశ్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. సిరిసిల్ల సభలో కేటీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్, స్టార్ హోటళ్ల వ్యవహారాలను బయటపెట్టామని, 19న సభతో హరీశ్ రావు పతనానికి కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ మొదలవుతుందని పేర్కొన్నారు.

ఆదివారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మామ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డం పెట్టుకుని, ఇతర పార్టీల నేతలను ప్రలోభపెడుతూ గెలుస్తున్న హరీశ్ ఆటలు ఇక సాగవన్నారు. ఆయన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రంగనాయక సాగర్ భూములు వ్యవహారాలను బయటపెట్టామని, 19న మరిన్ని భాగోతాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. 

ఆస్తుల పంపకాల్లో తేడాతోనే కవిత సొంత పార్టీ.. 

కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల పంపకాల తేడాతోనే కవిత బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. హరీశ్ రావు, సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుల అవినీతిని, ఎర్రవల్లి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అక్రమ నీటి తరలింపును ఆమె స్వయంగా బయటపెడుతున్నారని పేర్కొన్నారు. పదేండ్లలో ప్రగతి భవన్, ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ వ్యవహారాలకు ప్రత్యక్ష సాక్షి అయిన కవితకు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. హరీశ్ రావుకు దమ్ముంటే కవిత చేసిన ఆరోపణలపై ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్ పెట్టి సమాధానం చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.