విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలి: టీజీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ సీఎండీ

విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలి: టీజీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ సీఎండీ
  • ఎల్​నినో ప్రభావంతో విద్యుత్​ వినియోగం పెరిగే ఛాన్స్
  • టీజీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

మధిర, వెలుగు: వేసవిలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పెరగనున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను ముందుగానే పటిష్టం చేయాలని టీజీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం సర్కిల్ పర్యటనలో భాగంగా తొలుత మధిర డివిజన్ ఆఫీస్​లో ఆఫీసర్లు, సిబ్బందితో వేసవి కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.

వేసవిలో పెరగనున్న విద్యుత్ లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు, పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని, అదనపు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల ఏర్పాటు, కొత్త సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ల నిర్మాణ పనులు స్పీడప్​చేయాలని సూచించారు. అనంతరం మధిర పట్టణంలో చేపడుతున్న అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ కేబుల్ పనులను పరిశీలించారు.

బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో నిర్మాణం పూర్తయిన 33/11 కేవీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఆ తర్వాత వైరా పట్టణంలో ప్రతిపాదిత 33/11 కేవీ శాంతినగర్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అలాగే వైరాలో నిర్మించనున్న డివిజన్, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల స్థలాలను పరిశీలించారు.

వైరా రోడ్డులో నిర్మించనున్న ఇండోర్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించి, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఖమ్మం ఆపరేషన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ ఇనుగుర్తి శ్రీనివాస చారి, ఖమ్మం టౌన్ డీఈ రామారావు, మధిర డీఈ శ్రీనివాస్, వైరా డీఈ రమేశ్, ఏడీఈలు, వైరా, రూరల్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.