హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి సహకారం అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 19న హైదరాబాద్ కు రానున్నది. పర్యటనలో భాగంగా ఫౌండేషన్ టీమ్ ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నది. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యారంగ అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. అనంతరం నగరంలోని పలు సర్కారు స్కూళ్లను టీమ్విజిట్ చేసే అవకాశం ఉన్నది.
ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో విద్యారంగంపై బిల్ గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తున్నది. తెలంగాణలోనూ పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఇక్కడి విద్యారంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించనున్నది.
