- విచారణకు ఆదేశించిన రామగుండం సీపీ
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ బర్త్‌డే వేడుకలు ఫామ్‌హౌస్‌లో నిర్వహించగా, ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు పోలీసు కానిస్టేబుళ్లు డ్యాన్స్‌లు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 15న బెల్లంపల్లి పరిధిలోని కత్తర్ల గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.
బెల్లంపల్లి వన్‌టౌన్ పీఎస్‌కు చెందిన ఐదుగురు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లతో పాటు మరో ఆరుగురు కానిస్టేబుళ్లు ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉండటంతో వేడుకల్లో డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై పలు ఛానళ్లలో వార్తలు ప్రసారం కావడంతో విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఇదే విషయమై బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావును వివరణ కోరగా, తాను సెలవులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
