గోపాల్‌‌‌‌‌‌‌‌దిన్నె–సింగోటం రిజర్వాయర్ల అనుసంధాన లింక్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి జూపల్లి సమీక్ష

గోపాల్‌‌‌‌‌‌‌‌దిన్నె–సింగోటం రిజర్వాయర్ల అనుసంధాన లింక్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి జూపల్లి సమీక్ష

కొల్లాపూర్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన గోపాల్‌‌‌‌‌‌‌‌దిన్నె–సింగోటం రిజర్వాయర్ల అనుసంధాన లింక్ కెనాల్ పనుల పురోగతిపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.

కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌లోని తన క్యాంపు ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో సాగునీటి పారుదల శాఖ అధికారులతో పనుల పురోగతి, పూర్తయిన పనులు, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల వేగానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి, నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు.