నలుగురు జీపీ కార్యదర్శుల సస్పెన్షన్.. నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినందుకు చర్యలు

నలుగురు జీపీ కార్యదర్శుల సస్పెన్షన్.. నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినందుకు చర్యలు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలంలో 11 నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన నలుగురు పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్​ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని బూదాకుర్దు జీపీ ప్రస్తుత కార్యదర్శి బోర్లకుంట శ్రీనివాస్, సెలవులో ఉన్న కార్యదర్శి సాదుల్లా, పెరికపల్లి పంచాయతీలో ప్రస్తుత కార్యదర్శి సాయిరాం, బదిలీపై వెళ్లిన స్నిగ్దలను సస్పెండ్​ చేసినట్టు ఎంపీవో కృష్ణవేణి తెలిపారు.

ఆకెనపల్లి ప్రాంతంలో ఉన్న భూముల కోసం ఈ నకిలీ పత్రాలను జారీ చేసినట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారుల విచారణలో ఈ నకిలీ పత్రాల బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీవో ఆదేశించారు.