సమ్మక్కసాగర్‌‌‌‌‌‌‌‌కు ఎన్వోసీ ఇవ్వండి..చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ సీఎంతో రేవంత్ రెడ్డి భేటీ

సమ్మక్కసాగర్‌‌‌‌‌‌‌‌కు  ఎన్వోసీ ఇవ్వండి..చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ సీఎంతో రేవంత్ రెడ్డి భేటీ
  • త్వరలోనే ఎన్వోసీ ఇస్తామని చత్తీస్​గఢ్ సీఎం హామీ
  • ముంపు పరిహారం ముందే చెల్లిస్తామన్న రేవంత్ రెడ్డి
  • చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో మునిగేది 33 ఎకరాలేనన్న ఖరగ్ పూర్ ఐఐటీ
  • సీడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఎన్వోసీ ఒక్కటేనన్న సీఎం
  • 2021లోనే బ్యారేజీ పూర్తి.. 6.94 టీఎంసీల నిల్వ
  • ఎల్‌‌‌‌‌‌‌‌నినో వేళ నీటి నిల్వకు బ్యారేజీ అత్యవసరమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:ములుగు జిల్లా తుపాకులగూడెం దగ్గర నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీకి వెంటనే నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్​ సీఎం విష్ణుదేవ్ సాయ్‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘ఎల్‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులతో తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో సమ్మక్కసాగర్‌‌‌‌‌‌‌‌లో నీటిని నిల్వ చేసుకునేందుకు ఎన్వోసీతో పాటు మిగిలిన అనుమతులకు పూర్తిగా సహకరించండి’ అని విజ్ఞప్తి చేశారు.

 చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ముంపునకు గురయ్యే భూములకు అక్కడి చట్టాలు, నిబంధనల ప్రకారం భూసేకరణ, పరిహారం, పునరావాస నిధులు చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, అవసరమైతే ఆ మొత్తాన్ని ముందే చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్​​ ప్రభుత్వానికి జమ చేస్తామని స్పష్టం చేశారు. దీనికి స్పందించిన విష్ణుదేవ్ సాయ్, ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్వోసీ, ఇతర అనుమతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్సీఎంతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

మిగిలింది ఎన్వోసీ ఒక్కటేసమ్మక్కసాగర్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర స్థాయిలో దాదాపు అన్ని అనుమతులు వచ్చాయని, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దగ్గర పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నది చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్​ ఎన్వోసీ ఒక్కటేనని సీఎం రేవంత్ వివరించారు. 

పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ అనుమతులతో పాటు తొలి, రెండో దశ అటవీ అనుమతులు ఇప్పటికే వచ్చాయని, జలవిజ్ఞాన విభాగం, సీఎస్ఎంఆర్ఎస్, కేంద్ర భూగర్భ జల మండలి, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థల సాంకేతిక పరిశీలనలన్నీ పూర్తయ్యాయని చెప్పారు. ఎన్వోసీ కోసం 2025 సెప్టెంబర్ 22న రాయ్‌పూర్‌లో, 2026 జూన్ 11న హైదరాబాద్‌లో, సెప్టెంబర్ 4న ఢిల్లీలో చత్తీస్‌గఢ్ సీఎంను కలిసి చర్చించామని, లేఖల ద్వారానూ సంప్రదింపులు జరిపామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎన్వోసీ వస్తే గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల సహకార సమాఖ్య స్ఫూర్తి దేశానికే ఆదర్శమవుతుందని సీఎం రేవంత్, మంత్రి అన్నారు.

ఐదేండ్లుగా నిల్వ లేని బ్యారేజీ

గోదావరిపై తుపాకులగూడెం దగ్గర దాదాపు రూ.2 వేల కోట్లతో చేపట్టిన సమ్మక్కసాగర్ బ్యారేజీ నిర్మాణం 2021లోనే పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) +83 మీటర్ల దగ్గర 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా దీన్ని నిర్మించారు. మొదట 2009లో 50 టీఎంసీల వినియోగం, 22.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ‘పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి’గా ప్రతిపాదించి 2012లో సీడబ్ల్యూసీ నుంచి సూత్రప్రాయ సమ్మతి పొందారు. ముంపు తగ్గించి తుపాకులగూడెం దగ్గర నిర్మించాక 2020 ఆగస్టు 18న ‘సమ్మక్కసాగర్ ప్రాజెక్టు’గా పేరు పెట్టారు. 

ఈ ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్ రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాలు, రామప్ప–పాకాల అనుసంధానం కింద 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు భూపాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా 32,563 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, నల్గొండ జిల్లాల్లోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం. 

చత్తీస్‌గఢ్‌లో మునిగేది 33 ఎకరాలే

బ్యారేజీ ముంపును తగ్గించేందుకు తీసుకున్న చర్యలు, శాస్త్రీయ అధ్యయనాలను సమావేశంలో వివరించారు. ప్రాజెక్టును మొదట కంతనపల్లి దగ్గర ప్రతిపాదించగా, అక్కడ 11,408 ఎకరాల భూమి, 17 ఆదివాసీ గ్రామాలు, సరిహద్దు భద్రతా వసతులు ముంపునకు గురవుతాయని తేలడంతో బ్యారేజీని గోదావరి ఎగువన తుపాకులగూడెంకు మార్చారు. బ్యారేజీ వల్ల ఎగువన నీరు ఎగదన్నే ప్రభావంపై చత్తీస్‌గఢ్ కోరినట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో స్వతంత్ర అధ్యయనం చేయించామని, ఆ సర్వేల కోసం తెలంగాణ రూ.9.88 కోట్లు గత ఏప్రిల్‌లోనే చెల్లించిందని తెలిపారు. 

జులై 30న ఐఐటీ ఖరగ్‌పూర్ ఇచ్చిన నివేదిక ప్రకారం, పూర్తి స్థాయి నీటి మట్టం దగ్గర నది భాగాన్ని మినహాయిస్తే చత్తీస్‌గఢ్‌లో మునిగే ప్రైవేటు భూమి 32 నుంచి 33 ఎకరాలు మాత్రమేనని, అతి భారీ వరదలు వచ్చినా అదనంగా ప్రభావితమయ్యేది 100 ఎకరాల లోపేనని తేలిందని చెప్పారు. బీజాపూర్ జిల్లా యంత్రాంగంతో కలిసి ఇరు రాష్ట్రాల అధికారులు ఉమ్మడి సర్వేలు పూర్తి చేశారని, గుర్తించిన ప్రతి భూ యజమానికీ న్యాయబద్ధంగా పరిహారం ఇస్తామని సీఎం, మంత్రి హామీ ఇచ్చారు.