ముగ్గురు ప్రొఫెసర్లపై డీబార్‌‌‌‌ వేటు

ముగ్గురు ప్రొఫెసర్లపై డీబార్‌‌‌‌ వేటు
  • ఎండీ పీడియాట్రిక్స్‌‌‌‌ పరీక్షల నిర్వహణపై ఫిర్యాదులతో కాళోజీ హెల్త్​ వర్సిటీ చర్యలు

హైదరాబాద్, వెలుగు: ముగ్గురు ప్రొఫెసర్లపై కాళోజీ నారాయణరావు హెల్త్‌‌‌‌ యూనివర్సిటీ (కేఎన్‌‌‌‌ఆర్‌‌‌‌యూహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌) డీబార్‌‌‌‌ వేటు వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 7, 8 తేదీల్లో సికింద్రాబాద్‌‌‌‌ గాంధీ మెడికల్‌‌‌‌ కాలేజీలో ఎండీ పీడియాట్రిక్స్‌‌‌‌ ప్రాక్టికల్‌‌‌‌ పరీక్షలు జరిగాయి. వీటి నిర్వహణపై అక్టోబర్‌‌‌‌ 12న విద్యార్థులు యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 18న నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా గాంధీ మెడికల్‌‌‌‌ కాలేజీ ప్రొఫెసర్‌‌‌‌ వేదవ్యాస శ్రీగదె, వికారాబాద్‌‌‌‌ ప్రభుత్వ మెడికల్‌‌‌‌ కాలేజీ ప్రొఫెసర్‌‌‌‌ పి.కె. రాజీవ్‌‌‌‌ను రెండేళ్ల పాటు డీబార్‌‌‌‌ చేశారు.

వీరిని ఇంటర్నల్‌‌‌‌, ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ ఎగ్జామినర్లుగా, మూల్యాంకన విధులతో పాటు అన్ని యూనివర్సిటీ పరీక్షల బాధ్యతల నుంచి తప్పించారు. గాంధీ మెడికల్‌‌‌‌ కాలేజీ పీడియాట్రిక్స్‌‌‌‌ హెచ్‌‌‌‌వోడీ డాక్టర్‌‌‌‌ కె. వాసుదేవ్‌‌‌‌ను ఏడాది పాటు పరీక్షల విధులు, మూల్యాంకనానికి దూరంగా ఉంచారు. వీరిపై  శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిజిస్ట్రార్‌‌‌‌ డీఎంఈకి లేఖ రాశారు.