- ఇంట్లో ‘డౌన్‌టౌన్’ మిక్సింగ్
- శంషాబాద్లో క్యాబ్‌డ్రైవర్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: చీప్ లిక్కర్‌ను ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లలో మిక్స్చేస్తూ ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాను గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. వంగలి అశోక్ (43) గతంలో మద్యం తయారీ పరిశ్రమలో పని చేసేవాడు. అది మానేసి క్యాబ్ డ్రైవింగ్చేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో శంషాబాద్‌లోని శాతంరాయిలోని తన ఇంట్లో చీప్ లిక్కర్ దందా షురూ చేశాడు.
మహమ్మద్ యాకూబ్ పాషాకి స్క్రాప్ షాపు నుంచి ఖరీదైన ఖాళీ మద్యం బాటిల్స్ సీసాలను తెచ్చి అందులో రూ.560 విలువ చేసే ‘డౌన్ టౌన్’ మద్యాన్ని నింపేవాడు. జానీ వాకర్, దివార్స్, 100 పైపర్స్ వంటి ఖరీదైన బ్రాండ్ల పేర్లతో ఆ చీప్ లిక్కర్‌ను స్థానికంగా ఉండే పది మందికి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌పోలీసులు నిందితుడి ఇంటిపై రైడ్స్చేసి 10 ఫుల్ మిక్సింగ్ మద్యం బాటిళ్లతో పాటు 30కి పైగా ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నామని గ్రేటర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ గౌడ్ తెలిపారు.
లిక్కర్ మార్ట్‌లోనే కల్తీ..
కుత్బుల్లాపూర్: ఏకంగా లిక్కర్మార్ట్లోనే మద్యాన్ని కల్తీ చేసి అమ్ముతుండగా టాస్క్‌ఫోర్స్‌పోలీసులు రైడ్స్చేసి పట్టుకుని సీజ్‌చేశారు. నిజాంపేట్‌లోని ఓజీ లిక్కర్మార్ట్లో కొంతకాలంగా 100 పైపర్స్విస్కీ, బ్లెండర్స్ప్రైడ్, స్టెర్లింగ్బి, ఐకానిక్విస్కీ, రాయల్ఛాలెంజ్విస్కీ తదితర బాటిల్స్‌లో డీకే విస్కీ , ఓసీ విస్కీ , కేకే విస్కీ, ఐకాన్ విస్కీ కలిపి అమ్మతున్నారు. లిక్కర్మార్ట్కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌పోలీసులు రైడ్స్చేసి పట్టుకున్నారు. ఈ కేసులో నిర్వాహకుడు గండం ప్రవీణ్ గౌడ్‌ను అరెస్ట్ చేశారు.
