కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వరపల్లి పార్వతీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన కోనేరును సొంత డబ్బులతో పునర్నిర్మాణం చేయిస్తానని ప్రముఖ పారిశ్రామిక వేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి దగ్గరలో ఉన్న ఉత్తర గంగ కోనేరు పాడుబడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, కోనేరును అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆయన వెంట వచ్చిన అనుచరులు వెంటనే స్పందించి రూ.11 లక్షల వరకు చందాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సర్పంచ్ బాషెట్టి నాగరాజు, ఉపసర్పంచ్ అంబాల పుష్పలింగయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు నరేందర్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
