హార్వెస్టర్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తి కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కామారెడ్డి జిల్లాలో నలుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హార్వెస్టర్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తి కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కామారెడ్డి జిల్లాలో నలుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కామారెడ్డిటౌన్, వెలుగు : హార్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తిని కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రూ.10 లక్షలు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన నలుగురు నిందితులను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం జిల్లా ఎస్పీ రాజేశ్​చంద్ర మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కొనాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన చిందం మహేశ్​హార్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్లను లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. 

ఈ క్రమంలో కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పేరుతో పరిచయమైన నిట్టు నర్సింగరావు హార్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి, గత నెల 22న కారులో మహేశ్​ను తీసుకెళ్లి కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత అతడి ముఖానికి టోపీ తొడిగి, కొడుతూ, తన్నుతూ రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. అతడి సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ.2,500 నగదు కూడా లాక్కున్నారు. జైలులో పరిచయమైన నిట్టు నర్సింగరావు, ఎరుగు నగేశ్, చిందం శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలు నుంచి విడుదలైన తర్వాత సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా మహేశ్​ను లక్ష్యంగా చేసుకున్నారు. 

నర్సింగరావు సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డుపై కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పేరుతో నెల రోజుల పాటు మహేశ్​తో మాట్లాడి నమ్మించాడు. నగేశ్, నర్సింగరావు, తెడ్డూ సురేశ్​కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యక్షంగా పాల్గొనగా, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో ఉండి బాధితుడి కుటుంబ సభ్యుల కదలికలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాలను వారికి చేరవే శాడు. నిందితులు ఇందల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయి సమీపంలోని ఓ దాబా వద్ద మద్యం తాగి నిద్రలోకి జారుకోగా, ఇదే అదనుగా భావించిన మహేశ్​వారి నుంచి తప్పించుకుని ఇందల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయి బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు తప్పుడు సమాచారాన్ని కూడా ప్రచారం చేశారు. మరోసారి మహేశ్​ను కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు సోమవారం కొనాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన నిందితులు ఎల్లమ్మ గుడి వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. 

దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగరావు, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇందల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయి మండలం గన్నారానికి చెందిన ఎరుగు నగేశ్, తెడ్డూ సురేశ్, కొనాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన చిందం శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి కారు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాలుగు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, టోపీని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భిక్కనూరు సీఐ నరేశ్, దోమకొండ ఎస్సై ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.