నిజాం చెరువులో విద్యార్థిని మృతదేహం.. మహబూబాబాద్లో ఘటన

నిజాం చెరువులో విద్యార్థిని మృతదేహం.. మహబూబాబాద్లో ఘటన

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పదో తరగతి చదువుతున్న ఓ బాలిక మృతదేహం మహబూబాబాద్​ పట్టణంలోని నిజాం చెరువులో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివసించే నక్క స్వామి కూతురు తేజస్విని మహర్షి స్కూల్​లో టెన్త్​ క్లాస్​ చదువుతోంది. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో తేజస్విని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మహబూబాబాద్​ టౌన్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

చెరువులో మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తేజస్వినిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి నక్క స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.