ఢిల్లీలో తగ్గిన కాలుష్యం.. జీఆర్ఏపీ-3 ఎత్తివేత

ఢిల్లీలో తగ్గిన కాలుష్యం.. జీఆర్ఏపీ-3 ఎత్తివేత

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. కాలుష్యం తగ్గడంతో 10 రోజుల తర్వాత జీఆర్ఏపీ-3 ఆంక్షలను వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) ఎత్తివేసింది. అయితే జీఆర్ఏపీ-1, 2 నిబంధనలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీపావళి తర్వాత 400 దాటిన గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రస్తుతం 204కు పడిపోయింది. 

గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏక్యూఎం 'ఎక్స్‌‌‌‌‌‌‌‌' వేదికగా ప్రకటించింది. గత నవంబర్ 7న గాలి నాణ్యత పడిపోవడంతో జీఆర్ఏపీ-3 ఆంక్షలు విధించారు. గాలి వేగం తగ్గడం, దిశ మారడం, తేమ పెరగడం వంటి వాతావరణ పరిస్థితులతో కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.

దీంతో ఢిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో కాలుష్యం తీవ్రంగా పెరిగింది. నవంబర్ 15న సీపీసీబీ లెక్కల ప్రకారం ఢిల్లీలో ఏక్యూఐ 352గా నమోదైంది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో జీఆర్ఏపీ-3 ఆంక్షలు తొలగించారు. మిగతా రెండు దశల నిబంధనలు మాత్రం అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.