కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలో ఒక బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒకరు గాయపడ్డారు. మూసాపేటలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న విశ్లావత్ సాయికుమార్(31) మంగళవారం మధ్యాహ్నం కూకట్పల్లి నుంచి మూసాపేట వైపు బైక్‌పై వెళ్తున్నాడు. హెచ్‌పీ పెట్రోల్బంక్సమీపంలో బైక్ఆగిపోగా, కిందకు దిగి కిక్ కొడుతున్నాడు.
అకస్మాత్తుగా బైక్ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగి వ్యాపించాయి. దీంతో సాయికుమార్‌కు మంటలంటుకుని గాయపడ్డాడు. దీంతో అతడిని సమీపంలోని ప్రైవేట్దవాఖానకు తరలించారు. ఈ ఘటనలో బైక్పూర్తిగా కాలిపోయింది. పెట్రోల్లీక్కావడం, ఎలక్ట్రికల్ స్పార్క్ వల్ల మంటలు అంటుకుని ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కూకట్పల్లి పోలీసులు తెలిపారు.
