కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై, ఘర్షణకు దారితీసింది.

ఈ ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే ఇంటి వద్దకు దూసుకురావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మున్సిపల్ కార్మికులను తమ వ్యక్తిగత ఇంటి పనులకు వినియోగించుకుంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇప్పటివరకు ఆ కార్మికులకు చెల్లించిన వేతనాలను ఎమ్మెల్యే మున్సిపాలిటీకి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసు బలగాలతో ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. దీంతో వారు పీఎస్​ ఎదుట హైవేపై ఆందోళనకు దిగారు.