రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలు

రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలు

రాష్ట్రపతి, గవర్నర్​ అధికారాలు 

రాష్ట్రపతి

ఆర్టికల్ 53: కేంద్ర కార్యనిర్వహణ అధికారాలు.
ఆర్టికల్ 75: ప్రధాన మంత్రి, మంత్రి మండలిని నియమిస్తాడు.
ఆర్టికల్ 76: అటార్నీ జనరల్ ను నియమిస్తాడు.
ఆర్టికల్ 124, 217 ప్రకారం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు.
ఆర్టికల్ 316: యూపీఎస్సీ, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్, సభ్యులను నియమిస్తాడు.
ఆర్టికల్ 280: కేంద్ర, ఆర్థిక సంఘం, చైర్మన్, సభ్యులను నియమిస్తాడు.
ఆర్టికల్ 324: కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్, సభ్యులను నియమిస్తాడు.
ఆర్టికల్ 79: రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం. రాష్ట్రపతి ఆమోదం లేకుండా బిల్లులు చట్టాలు కావు.
ఆర్టికల్ 85: పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. వాయిదా వేస్తాడు.
ఆర్టికల్ 86: పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

గవర్నర్

ఆర్టికల్ 154: రాష్ట్ర కార్యనిర్వహణ
ఆర్టికల్ 164: ముఖ్యమంత్రి, మంత్రి మండలిని నియమిస్తాడు.
ఆర్టికల్ 165: అడ్వకేట్ జనరల్ ను నియమిస్తాడు.
ఆర్టికల్ 233: జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు.
ఆర్టికల్ 316: స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమిస్తాడు.
ఆర్టికల్ 243 (ఐ. వై): రాష్ట్ర ఆర్థిక సంఘం, చైర్మన్, సభ్యులను నియమిస్తాడు.
ఆర్టిలక్ 243కే, జెడ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమిస్తాడు.
ఆర్టికల్ 168: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం. గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లులు చట్టాలు కావు.
ఆర్టికల్ 174: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. వాయిదా వేస్తాడు.
ఆర్టికల్ 175: రాష్ట్ర విధానసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.