న్యూఢిల్లీ, వెలుగు: కమ్యూనిస్టులతో పాటు అందరూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరారని, కానీ ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరించారని సీపీఐ జాతీయ నేత కె. నారాయణ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సోనియా గాంధీ అలు పెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. భారత్ లో పుట్టకపోయినా.. ప్రజాస్వామ్య విలువ కోసం తపిస్తున్న వ్యక్తి అని కితాబిచ్చారు. ఇండియాలో పుట్టని సోనియా దేశం కోసం పరితపిస్తుంటే.. ఇక్కడే పుట్టిన మోదీ అమెరికా అడుగుజాడల్లోనడుస్తూ దేశానికి ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
