చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL ) కెరీర్‌కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే (2026, నవంబర్ 18, బుధవారం) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా, ఈ వీడియోని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
అందరూ నాకే తినిపించకండి: ధోనీ ఫన్నీ పంచ్
* కేక్‌పై ఎమోషనల్ క్యాప్షన్: థాంక్యూ మహీ భయ్యా.. మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి (Thank you Mahi Bhaiya for giving us so much happiness. May God bless you always) అని కేక్‌పై రాసి ఉంది.
* ధోనీ చమత్కారం: కేక్ కట్ చేసిన మహీ భాయ్ అక్కడున్న వారందరికీ స్వయంగా తినిపించాడు. తిరిగి వారంతా తనకు కేక్ తినిపించడానికి ముందుకు రాగా.. అందరూ నాకే తినిపించకండి అంటూ ధోనీ తనదైన శైలిలో వేసిన ఫన్నీ పంచ్ అక్కడున్న వారిలో నవ్వులు పూయించింది.
మెరీనా బీచ్ వద్ద డ్రోన్ షో.. మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్:
* నవంబర్ 17వ తేదీన ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ వెంటనే IPL 2027 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
ALSO READ : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు సిద్ధం.. పాక్ కెప్టెన్తో కలిసి తిలక్ వర్మ కేక్ కటింగ్!
* #ForOurThala ట్రిబ్యూట్: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ సందర్భంగా మంగళవారం రాత్రి చెపాక్ స్టేడియం, మెరీనా బీచ్ వద్ద ఆకాశంలో సీఎస్‌కే ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించి ఘనంగా నివాళులర్పించింది. 2026 సీజన్‌కు కాలి గాయం కారణంగా దూరమైన ధోనీ, ఇప్పుడు మెంటార్‌గా జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నాడు.
Cake Paglu celebrating, simple and sweet! 🥹💛 #ForOurThala 🎥 : kerkettaasiddharth https://t.co/TwU2TRzJwK
— Chennai Super Kings (@ChennaiIPL) November 18, 2026
