IPL 2027 Mini-Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈరోజు (బుధవారం, నవంబర్ 18, 2026) కీలక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 16, 2026న గోవా వేదికగా ఉదయం 11:00 గంటలకు వేలం ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు బెంగళూరు వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ ఉండటంతో, క్రికెట్ అభిమానులకు ఎలాంటి అంతరాయం కలగకుండా వేలాన్ని ఉదయం పూట నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఉదయం 11 గంటలకే వేలం ఎందుకంటే?:
డిసెంబర్ 16న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య 2వ వన్డే మ్యాచ్ (2nd ODI) జరగనుంది. మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండటంతో, బ్రాడ్‌కాస్టర్లు, క్రికెట్ అభిమానుల సౌలభ్యం కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11 గంటలకు వేలం మొదలుపెట్టడం వల్ల, మధ్యాహ్నం 2 గంటలకు వన్డే మ్యాచ్ మొదలయ్యేలోపు అభిమానులు 3 గంటల పాటు వేలాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా వీక్షించే అవకాశం ఉంటుంది.
వేలం, స్టార్ ప్లేయర్ల గైర్హాజరీ:
* మంగళవారం (నవంబర్ 17) 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి.
* రిటైన్, రిలీజ్ లెక్కలు: మొత్తం 10 జట్లు కలిసి 55 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 184 మందిని రిటైన్ చేసుకోగా, 34 మంది విదేశీయులతో కలిపి 89 మందిని రిలీజ్ చేశాయి. వేలంలో 25 విదేశీ స్లాట్లతో సహా మొత్తం 66 స్లాట్లను భర్తీ చేయనున్నారు.
* పర్స్ టాపర్స్: గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా 22 మందిని అట్టిపెట్టుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ రూ.47.45 కోట్ల అతిపెద్ద పర్స్‌తో బరిలోకి దిగుతోంది.
ALSO READ : అమ్మకానికి కోల్‌కతా నైట్‌రైడర్స్.. రూ.3,800 కోట్లకు 22.5% సేల్!
* వేలానికి దూరమైన స్టార్లు: ఆస్ట్రేలియా బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ కారణంగా ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకున్నారు. అలాగే మోకాలి గాయంతో ఆర్సీబీ విడుదల చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జేకబ్ బెతెల్ కూడా వేలంలో పేరు నమోదు చేసుకోవడం లేదు.
The stage is set for the next big bidding battle 🙌 The #TATAIPL 2027 Player Auction is set to take place on December 16, 2026 in Goa 🌴 #TATAIPLAuction https://t.co/NIRc7pChaO
— IndianPremierLeague (@IPL) November 18, 2026
