IPL 2027 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి ముందు 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల తుది జాబితాలను అధికారికంగా ప్రకటించాయి. డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న వేలానికి ముందు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (IPL Governing Council) ఈరోజు (నవంబర్ 18, బుధవారం) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అన్ని జట్లు కలిసి కేవలం రిటెన్షన్ల కోసమే రూ.1,002.05 కోట్లు ఖర్చు చేశాయి. దీంతో వేలంలో 10 జట్ల దగ్గర మొత్తం రూ.297.95 కోట్ల పర్స్ బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఈ వేలంలో 25 విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం 66 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉంది.
రిటెన్షన్, ట్రేడ్ విండో:
* అత్యధిక రిటెన్షన్స్ (GT): గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా 22 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, కేవలం రూ.8.75 కోట్ల పర్స్ (3 స్లాట్లు) మాత్రమే మిగిల్చుకుంది.
* అత్యధిక విదేశీ ఆటగాళ్లు (RCB): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 7 మంది విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. చెన్నై (CSK), పంజాబ్ (PBKS), రాజస్థాన్ (RR) జట్లు తలో 19 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.
* చివరి నిమిషం బిగ్ ట్రేడ్స్: రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి గుజరాత్ టైటాన్స్ (GT) జట్టులోకి ట్రేడ్ అయ్యాడు. మహ్మద్ షమీ, ఎం.సిద్ధార్థ్ లక్నో నుంచి రాజస్థాన్‌కు మారగా.. సామ్ కరన్ రాజస్థాన్ నుంచి లక్నోలోకి చేరాడు.
* పర్స్ బ్యాలెన్స్ టాప్-4: లక్నో సూపర్ జెయింట్స్ (రూ.47.45 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.41.65 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.40.15 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.39.50 కోట్లు) భారీ పర్స్‌తో వేలంలోకి అడుగు పెట్టబోతున్నాయి.
10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్:
గుజరాత్ టైటాన్స్ (GT - 22 మంది):
అనూజ్ రావత్, అశోక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్*, గుర్నూర్ సింగ్ బ్రార్, హర్షల్ పటేల్ (T), జాసన్ హోల్డర్*, జయంత్ యాదవ్, జోస్ బట్లర్*, కగిసో రబాడ*, కుమార్ కుశాగ్రా, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, ప్రసిద్ధ్ కృష్ణ, ఆర్. సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్*, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, టామ్ బాంటన్*, వాషింగ్టన్ సుందర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB - 20 మంది):
అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ డఫీ*, జితేశ్ శర్మ, జోర్డాన్ కాక్స్*, జోష్ హాజిల్‌వుడ్*, కనిష్క్ చౌహాన్, కృనాల్ పాండ్యా, నువాన్ తుషార*, ఫిలిప్ సాల్ట్*, రజత్ పటిదార్, రసిఖ్ దార్, రొమారియో షెపర్డ్*, సుయాశ్ శర్మ, టిమ్ డేవిడ్*, వెంకటేష్ అయ్యర్, వికీ ఓత్స్వాల్, విరాట్ కోహ్లీ, యశ్ దయాల్.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK - 19 మంది):
అకీల్ హోసేన్*, అన్షుల్ కాంబోజ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్*, గుర్జప్నీత్ సింగ్, జాక్ ఎడ్వర్డ్స్* (T), జేమీ ఓవర్టన్*, కార్తీక్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్* (T), ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్*, రాహుల్ చాహర్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్.
రాజస్థాన్ రాయల్స్ (RR - 19 మంది):
అమన్ రావు పేరాల, బ్రిజేష్ శర్మ, దసున్ శనక*, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా*, జోఫ్రా ఆర్చర్*, లువాన్-డ్రే ప్రిటోరియస్*, మణిమారన్ సిద్ధార్థ్ (T), మహ్మద్ షమీ (T), నాండ్రే బర్గర్*, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, శుభమ్ దూబే, సుశాంత్ మిశ్రా, వైభవ్ సూర్యవంశీ, యశ్ రాజ్ పుంజా, యశస్వి జైస్వాల్.
పంజాబ్ కింగ్స్ (PBKS - 19 మంది):
అజ్మతుల్లా ఒమర్జాయ్*, బెన్ డ్వార్షుయిస్*, కూపర్ కొన్నోలీ*, హార్దిక్ పాండ్యా (T), హర్నూర్ పన్ను, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్*, మార్కస్ స్టోయినిస్*, ముషీర్ ఖాన్, ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, వైశాఖ్ విజయ్‌కుమార్, జేవియర్ బార్ట్లెట్*, యశ్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH - 18 మంది):
అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్*, ఎషాన్ మలింగ*, హర్ష్ దూబే, హెన్రిచ్ క్లాసెన్*, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్ (T), క్రెయిన్స్ ఫులేత్రా, నాథన్ ఎల్లిస్* (T), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్*, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, సలీల్ అరోరా, శివాంగ్ కుమార్, స్మరణ్ రవిచంద్రన్, టి. నటరాజన్ (T).
లక్నో సూపర్ జెయింట్స్ (LSG - 18 మంది):
అబ్దుల్ సమద్, ఐడెన్ మార్కరమ్*, ఆకాష్ సింగ్, అక్షత్ రఘువంశీ, అర్జున్ టెండూల్కర్, అర్షిన్ కులకర్ణి, ఆయుష్ బదోని, దిగ్వేష్ రాఠీ, జోష్ ఇంగ్లిస్*, కుల్దీప్ యాదవ్ (T), మయాంక్ యాదవ్, మిచెల్ మార్ష్*, మొహ్సిన్ ఖాన్, ముకుల్ చౌదరి, నికోలస్ పూరన్*, ప్రిన్స్ యాదవ్, సామ్ కరన్* (T), షాబాజ్ అహ్మద్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR - 17 మంది):
అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, కామెరూన్ గ్రీన్*, ఫిన్ అలెన్*, హర్షిత్ రాణా, కార్తీక్ త్యాగి, మనీష్ పాండే, ప్రశాంత్ సోలంకి, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్*, సార్థక్ రంజన్, సౌరభ్ దూబే, సునీల్ నరైన్*, టిమ్ సీఫెర్ట్*, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC - 16 మంది):
అశుతోష్ శర్మ, ఆకిబ్ దార్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్*, కేఎల్ రాహుల్, కైల్ జేమీసన్*, లుంగీ ఎంగిడి*, మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (T), సమీర్ రిజ్వీ, త్రిపురణ విజయ్, ట్రిస్టన్ స్టబ్స్*, విప్రజ్ నిగమ్, జీషన్ అన్సారీ (T).
ముంబై ఇండియన్స్ (MI - 16 మంది):
అర్ష్‌దీప్ సింగ్ (T), అశ్వని కుమార్, కార్బిన్ బాష్*, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్*, నమన్ ధీర్, క్వింటన్ డి కాక్*, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్*, శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్*, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్*.
