దావూద్ ఇబ్రహీం ఇంటిని కూల్చివేస్తున్నారా.. ముంబై కార్పొరేషన్ అధికారుల వీడియో వైరల్

దావూద్ ఇబ్రహీం ఇంటిని కూల్చివేస్తున్నారా.. ముంబై కార్పొరేషన్ అధికారుల వీడియో వైరల్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇల్లుగా చెప్పబడుతున్న ముంబైలోని ఓ ఇంటిని కూల్చేవేత చర్యలు  తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సౌత్ ముంబైలోని భేండీ బజార్ లోని పక్మోడియా వీధిలో ఉన్న ఇబ్రహీం పూర్వీకుల  ఇంటిని కూల్చివేసేందుకు ఇవాళ (నవంబర్ 18)బీఎంసీ అధికారులు షెడ్యూల్ చేశారు.  కోర్టు ఉత్తర్వులు, ప్రమాదకరస్థితిలో ఉన్న  ఈ భవనం,  సీ1 కేటగిరి లో ఉన్నట్లు గుర్తించి కూల్చివేతకు సిద్దమమైనట్లు బీఎంసీ అధికారులు చెబుతున్నారు. దీంతో  భేండీ బజార్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాల్లోకివెళితే. 

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల నివాసం అయిన  ముంబైలోని ఓ భవనంపై కూల్చివేత చర్యల అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దక్షిణ ముంబైలోని భేండి బజార్ పక్మోడియా వీధిలో  హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా భవనాన్ని కూల్చివేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. ఈ భవనం ప్రమాదకర స్థితిలో ఉందని సీ1 కేటగిరీలో గుర్తించడంతో పాటు, 2020లో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు బీఎంసీ అధికారులు. 

1986లో దావూద్ ఇబ్రహీం భారత్ విడిచివెళ్లే ముందు అతడి కుటుంబం ఈ భవనంలో నివసించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం భేండి బజార్ క్లస్టర్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ భవనాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భవనంలోని చాలా భాగాన్ని ఖాళీ చేయించారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రార్థనా మందిరాన్ని తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రార్థనా కార్యక్రమాల కోసం తాత్కాలిక వసతి లేదా అద్దె భవనం కల్పిస్తామని, ఆ ఖర్చును తామే భరిస్తామని సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్ ప్రతిపాదించింది. మరోవైపు కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని స్థానిక ఎమ్మెల్యే అమీన్ పటేల్ చెబుతున్నారు. ప్రార్థనా మందిరానికి పునరాభివృద్ధి తర్వాత అదే ప్రాంతంలో శాశ్వత స్థలం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీఎంసీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.