Tharun Bhascker Eesha: తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా పెళ్లి ఫిక్స్.. స్టేజిపైనే చెప్పేసిన డైరెక్టర్ తల్లి!

Tharun Bhascker Eesha: తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా పెళ్లి ఫిక్స్.. స్టేజిపైనే చెప్పేసిన డైరెక్టర్ తల్లి!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ కం యాక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంట గురించే చర్చ! ఇన్నాళ్లూ వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వినిపించిన రూమర్స్‌కు తాజాగా తరుణ్ తల్లి గీతా భాస్కర్ కామెంట్స్‌తో మరింత హైప్ వచ్చింది. తన కొడుకు లైఫ్‌లో ఈషా ఒక మంచి సోల్‌మేట్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.

తరుణ్ కష్టాల్లో తోడుగా ఈషా..

గత రెండేళ్లుగా తరుణ్ భాస్కర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని గీతా భాస్కర్ వెల్లడించారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టుకోవడం వంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డాడని, ఒక్కోసారి రోజుల తరబడి ఇంటికి కూడా వచ్చేవాడు కాదని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఇంటికి వచ్చినా అర్ధరాత్రి 2 గంటలకు, తెల్లవారుజామున 4 గంటలకు వచ్చేవాడని తెలిపారు. ఫ్యూచర్ లో అలాంటి టైమ్‌లో తరుణ్‌కు అండగా నిలిచేలా ఈషా రెబ్బా ఉందని చెప్పారు. అర్ధరాత్రి వేళల్లో ఇంటికి వచ్చినా భోజనం పెట్టి, అతనికి మంచి ఫ్రెండ్‌గా, సపోర్ట్‌గా నిలిచే మనసు ఈషాది అని హీరోయిన్ పై ప్రశంసలు కురిపించారు.

నాకు వయసైపోతోంది.. తరుణ్‌కు తోడు దొరికింది..

గీతా భాస్కర్ చేసిన కామెంట్స్‌లో ఈ మాటలు ఇప్పుడు హైలైట్‌గా మారాయి. తనకు వయసు పెరుగుతోందని, తన తర్వాత తరుణ్‌కు ఎవరు తోడుగా ఉంటారోనని ఒకప్పుడు భయపడేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో అన్ని విషయాలు షేర్ చేసుకోలేమని, జీవితంలో మనసులోని ప్రతి విషయాన్ని చెప్పుకునే ఒక తోడు ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే ఈషా రూపంలో తరుణ్‌కు అలాంటి మంచి సోల్‌మేట్ దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' సినిమాను పూర్తి చేయడంలో కూడా ఈషా ఎంతో సపోర్ట్ చేసిందని వెల్లడించారు.

పెళ్లి రూమర్స్‌కు మరింత హైప్..

ఇప్పటికే తరుణ్, ఈషా రిలేషన్‌షిప్‌పై సోషల్ మీడియాలో చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కనిపించడం, పలు సందర్భాల్లో ఒకరికి ఒకరు సపోర్ట్‌గా ఉండటంతో అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఏకంగా తరుణ్ తల్లే ఈషాను సోల్‌మేట్‌గా అభివర్ణించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. దీంతో 'ఇన్నాళ్లూ ఫ్రెండ్స్ అనుకున్నాం.. ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది', 'త్వరలోనే పెళ్లి వార్త వినిపిస్తుందేమో' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తరుణ్, ఈషా పెళ్లిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి ఈ జంట తమ రిలేషన్‌షిప్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి!