పేరుకే విద్యార్థులకు సంక్షేమానికి పథకాలు.. కోట్లు ఖర్చు చేస్తున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ప్రధాన మంత్రి పోషణ్ స్కీం(మధ్యాహ్నం భోజనం )విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం ఇవ్వాల్సి ఉండగా.. ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల చారు లాంటి కూరను వడ్డిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఒడిశాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న మిడ్-డే మీల్ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం అన్నం, నీళ్లబాటు కూర మాత్రమే వడ్డిస్తున్న దృశ్యాలు వైరల్ బయటకు రావడంతో సదరు స్కీమ్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి. PM-POSHAN స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.12వందల78 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీంతోపాటు వంట ఖర్చులను కూడా ఇటీవల పెంచారు. అయినప్పటికీ పిల్లలకు అందుతున్న భోజనం నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేదని విమర్శకులు చెబుతున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం హయాంలో ఈ స్కీమ్‌ను పై తరగతుల విద్యార్థులకు కూడా వర్తింపజేశారు. మిల్లెట్ లడ్డూలనూ మెనూలో చేర్చారు. అయితే గతంలో జరిపిన ఆడిట్లలో నాసిరకం బియ్యం సరఫరా, పర్యవేక్షణలో లోపాలు బయటపడ్డాయని రిపోర్టులు చెబుతున్నాయి. పాఠశాలలో మిడ్-డే మీల్ అనేక పిల్లలకు రోజులో వారు తినే ఒకేఒక సరైన భోజనమని ,అటువంటి పరిస్థితుల్లో భోజన నాణ్యత మరింత కీలకమని, నేతలు ఈ విషయంలో తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
शर्म से डूब मरना चाहिए सरकार को चाहे किसी की सरकार हो 😡 https://t.co/pQUsxKwrhT
— Atul Londhe Patil (INDIA Ka Parivar)🇮🇳 (@atullondhe) November 17, 2026
