Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో శ్రీరాముడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలపై ముస్లిం నేతల ఫైర్!

Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో శ్రీరాముడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలపై ముస్లిం నేతల ఫైర్!

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1483 కోట్లకు పై వసూళ్లు రాబట్టింది. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ ప్రముఖ రచయిత, గేయరచయిత జావెద్ అక్తర్ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారాయి.  ప్రతి భారతీయుడి రక్తంలో రాముడు ఉన్నారని పేర్కొన్నారు. శ్రీరాముడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక ఆదర్శం, ఒక నైతికత, ఒక జీవన విధానమని అఖ్తర్ అభిప్రాయపడ్డారు.  అయితే ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది.

లేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న  జావెద్ అక్తర్... రణబీర్ కపూర్  నటించిన 'రామాయణ' గురించి మాట్లాడారు. ఈ సినిమాను తాను ఇంకా చూడలేదని, అయితే తన కుమార్తె, దర్శకురాలు జోయా అక్తర్ సినిమా చూసి బాగుందని ప్రశంసించిందని వెల్లడించారు. జోయా అంత సులభంగా ఏదీ ప్రశంసించదని, కనీసం తనను కూడా ఇప్పటివరకు అలా మెచ్చుకోలేదంటూ చమత్కరించారు.

గతంలో తన కలం నుంచి వచ్చిన 'పల్ పల్ హై భారీ' పాటను జావెద్ అక్తర్ ప్రస్తావించారు. 'మనసులో నుంచి రావణుడిని తొలగిస్తే.. ఆ మనసులో రాముడు ఉంటాడు' అనే భావన వెనుక ఉన్న తాత్వికతను వివరిస్తూ రాముడు కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక ఆదర్శం, నైతిక విలువలు, జీవన విధానమని పేర్కొన్నారు. మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి జీవితంలో రాముడి భావన ఉంటుందని వ్యాఖ్యానించారు.

►ALSO READ | Tharun Bhascker Eesha: తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా పెళ్లి ఫిక్స్.. స్టేజిపైనే చెప్పేసిన డైరెక్టర్ తల్లి!

అయితే జావెద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై ముస్లీం సంఘాలు మండిపడుతున్నాయి. జావెద్ అక్తర్ గతంలో అనేక వేదికలపై తాను నాస్తికుడినని, ఏ మతాన్నీ విశ్వసించనని చెప్పారని మౌలానా రషీద్ గుర్తుచేశారు. అలాంటప్పుడు ఇప్పుడు రాముడిపై ఇంత గొప్పగా మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. కేవలం బాలీవుడ్‌లో పాటలు అమ్ముకోవడం, వ్యాపార ప్రయోజనాలు పొందడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

అంతటితో ఆగకుండా.. జావెద్ అక్తర్ తన పేరును జావెద్ అక్తర్ నుంచి 'రామ్ పాల్'గా మార్చుకోవాలని సూచించారు. అలా పేరు మార్చుకుంటే దేశంలోని 80 శాతం మంది హిందువుల నుంచి పూర్తి గౌరవం, మర్యాద లభిస్తాయని వ్యాఖ్యానించారు. అక్తర్ కుటుంబం మొత్తం సినిమా పరిశ్రమలోనే ఉందని, ఒకరి పనిని మరొకరు పొగడటం కూడా వ్యాపారంలో భాగమేనని విమర్శించారు. అంతేకాదు, రెండు పడవలపై కాళ్లు పెట్టే ప్రయత్నం చేయవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటించిన 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రూ. 1500 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. మరి ఈ వివాదంపై జావెద్ అక్తర్ ఎలా స్పందిస్తారో చూడాలి..