న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ హిట్టర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్ ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అంతర్జాతీయ షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల పని భారాన్ని తగ్గించుకునేందుకు అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి తెలియజేయడంతో హెడ్‌ను రిలీజ్ చేశారు. 2025 మెగా వేలానికి ముందు హెడ్‌ను రూ.14 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ రిటేన్ చేసుకుంది.
2024 సీజన్‌లో 567 పరుగులు బాదిన అతను 2025, 2026 సీజన్లలో వరుసగా 374, 410 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మతో కలిసి అతను అందించిన శుభారంభాలు ఐపీఎల్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. సన్‌రైజర్స్ పేసర్ హర్షల్ పటేల్.. గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. రూ. 4 కోట్లకు అతన్ని ఎస్‌ఆర్‌హెచ్ ట్రేడ్ చేసింది. కమింద్ మెండిస్, జైదేవ్ ఉనాద్కట్, దిల్షాన్ మధుషనక, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, శివమ్ మావి, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ పైనీని కూడా ఎస్‌ఆర్‌హెచ్ రిలీజ్ చేసింది.
