భారత్‌‌‌‌ సమిట్‌‌‌‌ వివాదం.. సుప్రీంలో పిటిషన్‌‌‌‌

భారత్‌‌‌‌ సమిట్‌‌‌‌ వివాదం.. సుప్రీంలో పిటిషన్‌‌‌‌
  •  ఫిలిబెక్‌‌‌‌ ‘ఓట్‌‌‌‌ చోరీ’ వీడియోలు తొలగించాలని విజ్ఞప్తి  

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో జరిగిన భారత్‌‌‌‌ సమిట్‌‌‌‌-2026లో ఇటలీ నేత గియోకోమో ఫిలిబెక్‌‌‌‌ చేసిన ‘ఓట్‌‌‌‌ చోర్‌‌‌‌.. గద్దీ ఛోడ్‌‌‌‌’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలైంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్‌‌‌‌ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ జాహిద్‌‌‌‌ అలీ అనే వ్యక్తి మంగళవారం పిటిషన్‌‌‌‌ వేశారు. సమిట్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌కు మద్దతుగా ఫిలిబెక్‌‌‌‌ మాట్లాడిన వీడియోలను తొలగించాలని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌‌‌‌) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌‌‌‌లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, సంరుద్ధ భారత్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌, మెటా, ఎక్స్‌‌‌‌ కార్ప్‌‌‌‌, గూగుల్‌‌‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. నవంబర్‌‌‌‌ 14న సమిట్‌‌‌‌లో ఫిలిబెక్‌‌‌‌ ‘ఓట్‌‌‌‌ చోర్‌‌‌‌.. గద్దీ ఛోడ్‌‌‌‌’ నినాదాన్ని ప్రస్తావించడంతో పాటు రాహుల్‌‌‌‌ గాంధీ, కాంగ్రెస్‌‌‌‌కు మద్దతుగా మాట్లాడారని పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రజాస్వామ్య పునాదిని నిర్మించిందని, వాటిని కాపాడేందుకు పోరాడుతోందని ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జత చేశారు. విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన వీసాలు, అనుమతులు, సమిట్‌‌‌‌ నిర్వహణలో అధికారుల పాత్రపై సిట్‌‌‌‌తో విచారణ జరిపించాలని పిటిషనర్‌‌‌‌ కోరారు. కాన్ఫరెన్స్‌‌‌‌ వీసాలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం విదేశీయుల పర్యటన సదస్సులు, సెమినార్లు, వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లకే పరిమితం కావాలని పేర్కొన్నారు.