హైదరాబాద్‌‌‌‌లో జెహ్టూలింగ్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌లో జెహ్టూలింగ్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని తమ తయారీ కేంద్రంలో జెహ్ ఏరోస్పేస్‌‌‌‌ కొత్తగా టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌ను ప్రారంభించింది. ఏరో ఇంజిన్ల తయారీకి అవసరమైన కీలక టూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌‌‌‌, కమ్యూనికేషన్స్‌‌‌‌, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి.శ్రీధర్‌‌‌‌బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు విశాల్ సంఘ్వి, వెంకటేశ్ ముద్రగళ్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఏరో ఇంజిన్ తయారీకి అవసరమైన టూలింగ్ అసెంబ్లీల డిజైన్‌‌‌‌, తయారీ, తనిఖీ పనులు ఇక్కడ జరుగుతాయి. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కంపెనీ రెండో తయారీ కేంద్రం మాక్‌‌‌‌-2లో కొత్త ప్రొడక్టులు ఉత్పత్తి అవుతాయి. టూల్ డిజైన్‌‌‌‌, ప్రోగ్రామింగ్‌‌‌‌, ప్రెసిషన్‌‌‌‌ మ్యాచింగ్‌‌‌‌, తనిఖీ విభాగాల్లో నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జెహ్ విమానయాన, రక్షణ రంగాలకు విడిభాగాలను తయారు చేస్తోంది.