బయోగ్యాస్ కోసం రిలయన్స్ భారీ పెట్టుబడులు.. రూ.15 వేల కోట్లతో 100 ప్లాంట్లు

బయోగ్యాస్ కోసం రిలయన్స్ భారీ పెట్టుబడులు.. రూ.15 వేల కోట్లతో 100 ప్లాంట్లు

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం రిలయన్స్‌‌‌‌కు దేశంలోని 10  రాష్ట్రాల్లో 45 బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇవి ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 10 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 350 మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా. వ్యవసాయ వ్యర్థాలతో 2030 నాటికి రోజుకు 1,100 మెట్రిక్​ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.