కన్స్ట్రక్షన్ బిజినెస్లో నష్టాలు.. పెట్రోల్ పోసుకుని నిప్పు

కన్స్ట్రక్షన్ బిజినెస్లో నష్టాలు.. పెట్రోల్ పోసుకుని నిప్పు
  • చికిత్స పొందుతూ మృతి
  • మౌలాలి డీజిల్ లోకో షెడ్ సమీపంలో ఘటన

మౌలాలి, వెలుగు: నిర్మాణ రంగంలో ఎదురైన ఆర్థిక నష్టాలతో పాటు కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతున్న ఓ వ్యక్తి పెట్రోల్ ​పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాలోని వసంతపురి కాలనీకి చెందిన బాబురావు (51) గతంలో కన్​స్ట్రక్షన్​ఫీల్డ్​లో పనిచేస్తూ నష్టాలు చవిచూశాడు. దీంతో రెండేండ్లుగా ఇంటి వద్దే ఉంటున్న ఆయన మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడు.

ఈ క్రమంలో నవంబర్ 16న ఉదయం ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరిన బాబురావు, మౌలాలి డీజిల్ లోకో షెడ్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను గాంధీ దవాఖానకు తరలించగా, అదే రోజు కన్నుమూశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.