హైదరాబాద్, వెలుగు: సాయి పేరెంటరల్స్ విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్‌కు చెందిన బియాన్ థెరప్యూటిక్స్ ప్రిస్క్రిప్షన్ బిజినెస్‌లో మెజారిటీ వాటాను కొనేందుకు రెడీ అయింది. తన అనుబంధ సంస్థ ఎస్‌పీ అనలిటిక్స్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలాఖరులోగా లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం నగదు రూపంలోనే ఈ కొనుగోలు జరగనుంది. బియాన్ థెరప్యూటిక్స్‌కు 12 రాష్ట్రాల్లో వ్యాపారం ఉంది.
న్యూరోపతి, డయాబెటిస్ సపోర్టివ్ కేర్, మైటోకాండ్రియల్ హెల్త్, గాయాల సంరక్షణ, నొప్పి నివారణ విభాగాల్లో 16 బ్రాండెడ్ ఫార్ములేషన్లు ఉన్నాయి. మీయాక్సాన్, మైటోక్యూ7, అడ్గాబా, సన్‌లైట్, ఎల్‌జీ బియాన్ దీని ప్రధాన బ్రాండ్లు. దాదాపు 250 మంది ఫీల్డ్ సిబ్బంది 20 వేల మంది డాక్టర్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారని సాయి పారెంటరల్స్ తెలిపింది.
