- ఇయ్యాల్టి నుంచి వారం రోజుల పాటు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో తొలి బొగ్గు సరఫరా మార్గాన్ని బుధవారం నుంచి 24 వరకు షట్‌డౌన్ చేసి రిపేర్లు నిర్వహించనున్నట్లు జెన్కో తెలిపింది. కన్వేయర్ బెల్టులు, క్రషర్లు, స్టాకర్, రీక్లెయిమర్ తదితర కీలక విభాగాల్లో సమగ్ర రిపేర్లు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన విడిభాగాలు ప్లాంట్ వద్ద రెడీగా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.
రిపేర్ల సమయంలో కరెంటు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా మిగిలిన మూడు మార్గాల ద్వారా నాలుగు యూనిట్లతో 2 వేల మెగావాట్ల విద్యుత్ అందించే ప్రణాళిక రూపొందించినట్లు జెన్కో తెలిపింది. అవసరమైన పక్షంలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌తో సమన్వయం చేసుకుని ఉత్పత్తిని 1,800 మెగావాట్లకు తగ్గించే ప్రత్యామ్నాయ చర్యలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ పనులను పీఎంపీఎల్, బీటీపీఎల్, ఎల్ అండ్‌టీ అనుబంధ సంస్థల సహకారంతో చేపట్టనున్నారు.
