MLC బల్మూరి వెంకట్ కారును ఢీ కొట్టిన లారీ.. తిరుమల నుంచి వస్తుండగా ప్రమాదం

MLC బల్మూరి వెంకట్ కారును ఢీ కొట్టిన లారీ.. తిరుమల నుంచి వస్తుండగా ప్రమాదం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర MLC ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారుని లారీ ఢీ కొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. వెంకట్ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కొత్తూరు బైపాస్ ఈ ప్రమాదం జరిగింది.

కోళ్ల లోడ్తో వస్తున్న లారీ ఈ కారును ఢీ కొట్టింది. తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. లారీ కారు వైపు దూసుకొచ్చి ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం.

అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం జరిగిందన్న వార్తతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. కారులో ప్రమాద సమయంలో బల్మూరి వెంకట్ దంపతులతో పాటు ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

తిరుమల నుంచి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.