ఇండ్ల స్థలాల కోసం నవంబర్ 20న జర్నలిస్టుల మహాధర్నా

ఇండ్ల స్థలాల కోసం నవంబర్ 20న జర్నలిస్టుల మహాధర్నా

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 20న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో జర్నలిస్టుల మహా ధర్నా నిర్వహించనున్నట్లు గ్రేటర్  హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ వెల్లడించారు.

ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలపనున్నారని చెప్పారు. ఇండ్ల స్థలాల కోసం ఏండ్లుగా ఎదురుచూసి నిరాశ, నిస్పృహలకు లోనైన గ్రేటర్ జర్నలిస్టులంతా అధిక సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.