ఆఫీసుల ఆధునీకరణతో అదనంగా 15 వేల900 కోట్ల విలువ: నైట్ఫ్రాంక్ స్టడీ రిపోర్ట్

ఆఫీసుల ఆధునీకరణతో అదనంగా 15 వేల900 కోట్ల విలువ: నైట్ఫ్రాంక్ స్టడీ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: నగరంలోని పాత ఆఫీస్ భవనాలను ఆధునీకరిస్తే భారీగా విలువ పెరిగే అవకాశం ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. ఆధునీకరణకు అనువైన కార్యాలయ భవనాల విలువ ప్రస్తుతం ఉన్న రూ.20,700 కోట్ల నుంచి రూ.36,500 కోట్లకు చేరగలదు. సుమారు రూ.15,900 కోట్ల అదనపు విలువ సృష్టించే అవకాశం ఉంది.

ఈ మార్పుతో విలువలో 77శాతం వృద్ధి నమోదవుతుంది. హైదరాబాద్‌‌‌‌లో మొత్తం 136 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలం ఉంది. ఇందులో దాదాపు 15శాతం భవనాలు ఆధునీకరణకు అనువుగా ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, రాయదుర్గం ప్రాంతాల్లోని భవనాలకు ఈ అవకాశాలు ఉన్నాయి.