న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఎండీ పీవీ కృష్ణారెడ్డి తన మామ పిచ్చిరెడ్డి వాటాను కొనేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.7,000 కోట్లు సమీకరించారు. డేవిడ్‌సన్ కెంప్నర్ క్యాపిటల్, వర్డే పార్ట్నర్స్, హిల్‌హౌస్ క్యాపిటల్ నిధులను సమకూర్చాయి.
వీటితో కుటుంబానికి చెందిన మేఘా గ్రూపులో యాజమాన్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని కృష్ణారెడ్డి భావిస్తున్నారు. ఎంఈఐఎల్ ప్రధాన వ్యాపారాన్ని మరో 2–3 ఏళ్లలో ఐపీఓకు తీసుకెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రుణం వడ్డీ, తిరిగి చెల్లించే గడువు వంటి వివరాలు బయటకు రాలేదు.
