కూకట్పల్లి కేపీఎన్ సూపర్ మార్కెట్లో కుళ్లిన కర్జూర !

కూకట్పల్లి కేపీఎన్ సూపర్ మార్కెట్లో కుళ్లిన కర్జూర !
  • షాక్కు గురైన కస్టమర్
  • అన్ని బాక్సులూ అంతే.. సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని కేపీఎన్​సూపర్​మార్కెట్​లో కర్జూర పండ్లు కొన్న వినియోగదారుడు అవి కుళ్లిపోయి పురుగులు పట్టి ఉండటం చూసి షాక్​కు గురయ్యాడు. నిజాంపేట రోడ్డులోని కేపీఎన్​ఫ్రెష్​సూపర్​మార్కెట్​లో ఓ వ్యక్తి మంగళవారం కర్జూర పండ్ల బాక్స్​ కొన్నాడు. ఇంటికి వెళ్లి ఓపెన్​చేసి చూడగా పండ్లు పూర్తిగా పురుగులు పట్టి ఉన్నాయి.

తిరిగి సూపర్​ మార్కెట్​కు వెళ్లి ప్రశ్నించగా, నిర్వాహకులు ‘మేం ఏమన్నా బాక్స్​ ఓపెన్​ చేసి చూస్తమా ఏంది? మాకెట్ల తెలుస్తది.. అందులో పురుగులున్నయో..ఏమున్నయో’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతడు మిగతా కర్జూర పండ్ల బాక్స్​లను ఓపెన్​ చేసి చూడగా అన్నీ కుళ్లిపోయి ఉన్నాయి. దీంతో అక్కడున్న కస్టమర్స్​నిర్వాహకులను నిలదీశారు. ఆరోగ్య శాఖ అధికారులు సూపర్​మార్కెట్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.