రావల్పిండి: పాకిస్తాన్‌తో మంగళవారం మొదలైన తొలి టెస్ట్‌లో శ్రీలంక బ్యాటింగ్‌లో తడబడింది. మహ్మద్ అబ్బాస్ (3/14), రజావుల్లా (3/21), అమేర్ జామల్ (3/24) విజృంభించడంతో టాస్ ఓడిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 98 రన్స్‌కే ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (32), సోనల్ దినుషా (21) మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లలో 121/3 స్కోరు చేసింది. అజాన్ అవైస్ (47 బ్యాటింగ్), సాకిబ్ ఖాన్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తయ్యబ్ ఆరిఫ్ (46) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం పాక్ 23 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
