హాంకాంగ్‌‌ టోర్నీలో భారత ద్వయం సాత్విక్‌‌–చిరాగ్‌‌ బోణీ

హాంకాంగ్‌‌ టోర్నీలో భారత ద్వయం సాత్విక్‌‌–చిరాగ్‌‌ బోణీ

కౌలూన్: ఇండియా డబుల్స్‌‌ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి జోడీ హాంకాంగ్‌‌ సూపర్‌‌–500 టోర్నీలో బోణీ చేశారు. మంగళవారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ తొలి రౌండ్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ 15–21, 21–17, 28–26తో లీ జె హుయ్‌‌–పో సువాన్‌‌ యాంగ్‌‌ (చైనీస్‌‌తైపీ)పై గెలిచారు. 68 నిమిషాల మ్యాచ్‌‌లో తొలి గేమ్‌‌లో ఓడినా.. తర్వాతి రెండు గేమ్‌‌ల్లో ఇండియన్‌‌ ప్లేయర్లు అద్భుతంగా పోరాడారు.

మూడో గేమ్‌‌లో నాలుగు గేమ్‌‌ పాయింట్లు కాచుకుని విజయం సాధించారు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ క్వాలిఫయింగ్‌‌లో ధ్రువ్‌‌ కపిల–రాధిక శర్మ 21–17, 21–17తో యింగ్‌‌ కిట్‌‌ చెంగ్–య్యూట్‌‌ లీ లియాంగ్‌‌ (హాంకాంగ్‌‌)పై గెలిచి మెయిన్‌‌ డ్రాలోకి ప్రవేశించారు.