జొహన్నెస్‌బర్గ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. టెంబా బావుమా (49 రిటైర్డ్‌హర్ట్), రైన్ రికెల్టన్ (56 బ్యాటింగ్) మెరుగ్గా ఆడటంతో 287/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 386/7 స్కోరు చేసింది. రికెల్టన్‌తో పాటు రబాడ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
వియాన్ ముల్డర్ (0), మార్కో యాన్సెన్ (8), సిమోన్ హార్మర్ (1) నిరాశపర్చారు. హసన్ మహ్మద్ 4, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 28 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ప్రస్తుతం సఫారీ జట్టు ఇంకా 14 రన్స్ వెనకబడి ఉంది.
