న్యూఢిల్లీ: ఇండియా డబుల్ ఒలింపిక్ పతక విజేత, స్టార్ షూటర్ మను భాకర్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అథ్లెటిక్స్ కమిటీకి ఎన్నికైంది. 2026–30 కాలానికి గాను ఈ ఎన్నికలు జరిగాయి. ఈ విభాగంలో రెండు స్థానాల కోసం 10 మంది పోటీపడగా మను విజయం సాధించింది.
షూటర్లందరికీ మెరుగైన, స్థిరమైన వాతావరణం కల్పించడంతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్లలో మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగం కొనసాగేలా చూడటం తన ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా మను పేర్కొంది. గతంలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 2010 నుంచి 2020 వరకు ఈ కమిటీలో సేవలు అందించడమే కాకుండా చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
