పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 63 ఉద్యోగాలను తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సూపరింటెండెంట్ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియంత్రణ పరిధిలో 2027 మార్చి 31 వరకు లేదా అవసరం ముగిసే వరకు ఈ నియామకాలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
63 పోస్టుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్ 9, రేడియోగ్రాఫర్ 9, ఎలక్ట్రీషియన్ 4, సీటీ అండ్ ఎంఆర్ఐ టెక్నీషియన్ 4, ఫార్మాసిస్ట్4, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ 2, ఈసీజీ టెక్నీషియన్ 2, ఆక్సిజన్ టెక్నీషియన్ 1 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హత గల వారు నవంబర్18 నుంచి నవంబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు గాంధీ దవాఖానలోని మెయిన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సూపరింటెండెంట్ ఆఫీసులో దరఖాస్తు ఫారాలను తీసుకుని, 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సూపరింటెండెంట్ ఆఫీసులో సమర్పించాలి. విద్యార్హతలు, ఎంపిక విధానం ఇతర వివరాల కోసం www.gandhihospital.telangana.gov.in లేదా www.gmcsecunderabad.org వెబ్సైట్ను విజిట్చేయాలని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ తోట ఉషారాణి కోరారు.
