స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగానికి చెందిన సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(Sigma Advanced Systems) షేరు గత కొంతకాలంగా అసాధారణమైన వృద్ధితో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడచిన ఏడాది కాలంలో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తూ 400 శాతానికి పైగా భారీ లాభాలను నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా బిజినెస్ చేస్తున్న కంపెనీ.. అత్యాధునిక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ తయారీ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ కంపెనీ గ్లోబల్ డిఫెన్స్ దిగ్గజాలకు టైర్-1 భాగస్వామిగా సేవలు అందిస్తోంది. భారత్, యూకే దేశాలలో దీనికి తయారీ యూనిట్లు ఉండగా.. రోల్స్ రాయిస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో భారీ ఎత్తున ఏరోస్పేస్ కాంట్రాక్టులను కలిగి ఉండటం షేరుపై అంచనాలు పెంచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న తయారీ కేంద్రం ద్వారా అంతర్జాతీయ స్థాయి డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేస్తూ గ్లోబల్ మార్కెట్‌పై సంస్థ గట్టి పట్టు సాధిస్తోంది.
గడచిన ఏడాది కాలంలో ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 140 దగ్గర ఉండగా.. గరిష్టంగా షేరు ధర రూ.1,165 వరకు దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇది రూ.950 దగ్గర ట్రేడవుతుండగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 18వేల కోట్ల మార్కును తాకింది. దీంతో ఏడాది కిందట షేరులో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకూ కొనసాగించిన ఇన్వెస్టర్ల సంపద 5 రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లకు చేరుకుంది.
ప్రభుత్వం డిఫెన్స్ రంగానికి ఇస్తున్న ప్రత్యేక ప్రాధాన్యం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విధానాలు ఈ కంపెనీ ఆర్డర్ బుక్కు ఎంతో బలాన్ని చేకూరుస్తున్నాయి. మేనేజ్మెంట్ అంచనాల ప్రకారం.. రాబోయే FY28 నాటికి రూ. 2వేల కోట్ల రెవెన్యూ సాధించాలని, 25-30% EBITDA మార్జిన్లను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డిఫెన్స్ రంగంలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూలంగా ఉన్నారు. అయితే గత ఏడాది కాలంలో స్టాక్ ధర విపరీతంగా పెరగడం వల్ల దీని వ్యాల్యుయేషన్స్ ప్రస్తుతం కాస్త ఖరీదైన జోన్లో ఉన్నాయి. షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ రాబోయే కాలంలో మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న ఇన్వెస్టర్లు ధర తగ్గినప్పుడు కొనుగోలు చేసే ప్లాన్ ఫాలో అవటం మంచిందని కంపెనీ చెబుతోంది. ఈ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం బెటర్.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏవైనా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. మీ పెట్టుబడి నిర్ణయాలకు వీ6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలాంటి బాధ్యత వహించరు.
