హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావుకు సోషల్ మీడియా సంస్థ X నుంచి నోటీసులు అందాయి. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్ అంటూ నాగేశ్వరరావు X వేదికగా పోస్టు చేయడంతో వివాదానికి దారితీసింది.
సజ్జనార్‌పై నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు X సంస్థను అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ క్రిమంలోనే నాగేశ్వరరావు పెట్టిన అభ్యంతరకర పోస్టును X సంస్థ తొలగించింది. ఈ విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా ఆయనకు తెలియజేస్తూ నోటీసులు పంపించింది.
X సంస్థ నుంచి నోటీసులు అందుకున్న వెంటనే నాగేశ్వరరావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ను ట్యాగ్ చేస్తూ మరో పోస్టు చేశారు. తాను చేసిన పోస్టులో ఏ చట్టాన్ని ఉల్లంఘించానో, ఏయే సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.
ALSO READ : అతను బయట ఉంటే ..ఆకాశం ఏమీ ఊడిపడదు
అంతేకాకుండా చట్టబద్ధమైన పోలీసింగ్‌ను అమలు చేయడంలో హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తన పోస్టులో తెలిపారు.. మొత్తానికి సజ్జనార్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు, వాటిపై పోలీసుల అభ్యర్థన, X సంస్థ తీసుకున్న చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
