హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మర్డర్.. భార్యను గొంతో కోసి చంపిన భర్త

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మర్డర్.. భార్యను గొంతో కోసి చంపిన భర్త

హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దారుణం జరిగింది. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్‌లో భార్యను కిరాతకంగా హత్య చేశాడు భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మేందర్, అస్మా బేగం (30) ఇద్దరూ బీహార్‌కు చెందినవారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. 

15 ఏళ్ల క్రితం బీహార్ నుంచి హైదరాబాద్ పాతబస్తీలోని హసన్ నగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. గత కొంతకాలం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం (నవంబర్ 17) కూడా దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ధర్మేందర్ పదునైన కత్తితో భార్య అస్మా బేగం గొంతు కోశాడు.

తీవ్ర గాయాలతో అస్మా బేగం అక్కడికక్కడే మరణించింది. అనంతరం తన 3 ఏళ్ల కుమార్తెను తీసుకుని పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు బహదూర్‌పురా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు పాల్పడిన ధర్మేందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.