కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండలంలోని గుడికల్ గ్రామంలో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోదీ జ్ఞాపకార్థం ఒక మందిరం, స్మారక సముదాయం నిర్మించాలని నిర్ణయించింది మాత శ్రీ మందిరం చారిటబుల్ సొసైటీ. నవంబర్ 15న భూమి పూజ నిర్వహించి నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. అదోని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాతృత్వానికి నివాళి అర్పించేందుకు ఈ మందిరం నిర్మిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. హీరాబెన్ మోడీ తన కొడుకు ద్వారా దేశానికి చేసిన సేవకు ఆమె జ్ఞాపకాన్ని శాశ్వతంగా నిలపాలని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు ట్రస్ట్ సభ్యులు.
గుడికల్లో కేటాయించిన స్థలంలో దాతల సహాయంతో దశల వారీగా నిర్మాణం చేపడతామని... రూ. 3 లక్షల అంచనా వ్యయంతో తయారు చేసిన హీరాబెన్ మోదీ మార్బుల్ విగ్రహం సిద్ధంగా ఉందని, గర్భగుడి నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు తెలిపారు సభ్యులు.
హీరాబెన్ మందిర సముదాయంలో శివుడు, రాముడు, వినాయకుడు, దక్షిణమూర్తి ఆలయాలు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు ట్రస్ట్ సభ్యులు. నిర్మాణ పనులు ముందుగా గోశాల నుండి మొదలవుతాయని, తర్వాత ప్రధాన ఆలయాలు, చివరకు అనాథాశ్రమం నిర్మిస్తామని తెలిపారు.
