జీవితం ఒక మజిలీ. అది ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదు. జీవనప్రయాణంలో అది పెట్టే పరీక్షలను తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. తట్టుకొని నిలబడటం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
జీవితంలో అందరికీ మంచి, చెడు రెండూ జరుగుతాయి. కానీ, కొంతమంది జరిగిపోయిన చెడు సంఘటల్ని పదే పదే తలుచుకుంటూ ఉంటారు. ఇదే యాంగ్జెటీ. ఈ యాంగ్జెటీ నెమ్మదిగా డిప్రెషన్ గా మారుతుంది. మైల్డ్, మోడరేట్ డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. దీనికి మందులు, డాక్టర్ అక్కర్లేదు.
పాజిటివ్ గా ఆలోచించడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని దీన్నుంచి బయటపడొచ్చు. డిప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతుంది. ఈ టెండెన్సీ ఉంటే కచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాలి. లో మూడ్ లో ఉన్నప్పుడు మన మూడ్ ను ఎలివేట్ చేసే పనులు చేయాలి.
సంతోషం కలిగించే వ్యక్తులతో మాట్లాడాలి. మనసుకు నచ్చిన మూవీ చూడాలి. ఎప్పుడూ రూమ్‌లోనే ఉండకుండా బయటకు వెళ్లిపోవాలి. నేచర్ ను ఎంజాయ్ చేయాలి. ఫొటో ఆల్బమ్స్ తీసి చూడాలి. ఫొటోల్లో దాదాపు అన్ని హ్యాపీ మూమెంట్సే ఉంటాయి. కాబట్టి, అవి చూసినప్పుడు ఆటోమెటిక్‌గా డిప్రెషన్ నుంచి బయటపడేలా సాయపడతాయి.
