ముఖ్యమంత్రిని పెళ్ళికి పిలిస్తే.. ఏంటి ఈ రాతలు...? మంత్రి లోకేష్ ట్వీట్..!

ముఖ్యమంత్రిని పెళ్ళికి పిలిస్తే.. ఏంటి ఈ రాతలు...? మంత్రి లోకేష్ ట్వీట్..!

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూతురి వివాహం పొలిటికల్ డ్రామాకు తెర లేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని యలహంక భవనంలో పెళ్లికి జగన్ అభ్యంతరం చెప్పడం హాట్ చర్చనీయాంశం అవ్వగా.. ఇప్పుడు సీఎం చంద్రబాబును పెళ్ళికి ఆహ్వానించడంపై దుమారం రేగుతోంది. 

షర్మిల కూతురి పెళ్ళికి చంద్రబాబును ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ సాక్షి పత్రికలో కథనం వచ్చింది. ఈ కథనాన్ని తప్పు పడుతూ షర్మిల ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ కూడా సాక్షి కథనాన్ని ఖండిస్తూ ట్వీటీ చేశారు. పెద్దలను పెళ్ళికి పిలిస్తే కించపరిచేలా కథనం రాయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు లోకేష్. 

పెద్దలను పెళ్ళికి ఆహ్వానించడం మన సంస్కృతీ, సంప్రదాయమని అన్నారు. షర్మిల తన కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ కథనాలు రాయడం సమంజసం కాదని అన్నారు లోకేష్. 

రాజకీయంగా విభేదాలు ఉండచ్చు కానీ.. ఎప్పుడు మన విలువలు కోల్పోకూడదని అన్నారు లోకేష్.మహిళల వ్యక్తిత్వ హననానికి ఏపీలో తావు లేదని.. ఇలాంటి చర్యలు సాచించేది లేదని అన్నారు లోకేష్.